News March 14, 2026
మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.
Similar News
News April 8, 2026
US, ఇరాన్ వార్నింగ్స్.. గల్ఫ్ దేశాల్లో అలర్ట్!

US, ఇరాన్ పరస్పర హెచ్చరిక నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. 6 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని కువైట్ తమ దేశ ప్రజలకు సూచించింది. ఇక ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. అటు ఖతర్‌లో థ్రెట్ అలర్ట్ జారీ చేశారు. అధికారుల సూచనలు పాటించాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. సౌదీ అరేబియాకు రావొద్దని, హజ్ యాత్రను విరమించుకోవాలని US ఎంబసీ తమ దేశస్థులకు సూచించింది.
News April 8, 2026
బాపట్ల: సీఎం పర్యటనతో ట్రాఫిక్ మళ్లింపు

CM చంద్రబాబు సూరేపల్లి పర్యటన నేపథ్యంలో ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని రేపల్లె DSP శ్రీనివాసరావు తెలిపారు. వేమవరం జంక్షన్ వద్ద నుంచి రేపల్లె వైపు వాహనాలను హైవే మీదుగా మళ్లించనున్నారు. పల్లెకోన-కోనేటిపురం మార్గంలో వచ్చే వాహనాలను పడమటిపాలెం వద్ద డైవర్ట్ చేసి, జిల్లేపల్లి–పెద్దవరం మీదుగా కనగాల వద్ద ఎన్‌హెచ్–216Aలోకి మళ్లించనున్నట్లు తెలిపారు. వాహనదారులు గమనించాలన్నారు.
News April 8, 2026
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ వార్నింగ్

ట్రంప్ తన హెచ్చరికలను నిజం చేస్తూ దాడులకు దిగితే ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ మిలటరీ వర్గాలు తెలిపాయి. US, దాని భాగస్వామ్య దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. ఇక ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను 2 వారాలు పొడిగించాలని పాక్ PM షరీఫ్ కోరారు. రెండు వారాల పాటు హార్ముజ్‌ను తెరవాలని ఇరాన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు సీజ్‌ఫైర్ పాటించాలన్నారు.


