News October 12, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రగతి పరుగులు..!

MNCL జిల్లాగా ఏర్పడి నేటికీ 9 వసంతాలు పూర్తయ్యాయి. మరి ఈ కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది పునరాలోచన చేసుకోవాలి. ప్రత్యేక జిల్లా ఏర్పడ్డాక పరిపాలన పరిధి తగ్గి ప్రజలకు త్వరగా సేవలు అందుతున్నాయి. పలు విలీన గ్రామాలను కలిపి MNCL నగరపాలక సంస్థ ఏర్పడటం అభివృద్ధిలో కీలకమైంది. బెల్లంపల్లి, క్యాతనపల్లి, మందమర్రి, RKP అభివృద్ధి చెందుతున్నాయి. రైళ్ల రాకపోకలతో రవాణా మెరుగైంది. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News October 12, 2025
వంటింటి చిట్కాలు

☛ బెండకాయ కూర చేసే ముందు ముక్కల మీద నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
☛ నాన్‌వెజ్ వండిన పాత్రల్లో నీచు వాసన పోవాలంటే వాటిలో కొద్దిగా ఉప్పు వేసి కాసేపటి తర్వాత కడిగితే సరిపోతుంది.
☛ పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ వెయ్యాలి.
☛ సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలు/ కాస్త శెనగపిండిని కలిపితే ఉప్పు తగ్గుతుంది. <<-se>>#VantintiChitkalu<<>>
News October 12, 2025
జగిత్యాల: దరఖాస్తులకు 7 రోజులే ఛాన్స్..!

2025- 27 లైసెన్స్ పీరియడ్ కోసం JGTLలో 71 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకోవడానికి 7 రోజులు(OCT 18) మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 3 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, పాన్, కుల ధృవీకరణ పత్రం, రూ.3,00,000 డీడీ లేదా చలాన్‌ను జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ లేదా ధరూర్ క్యాంప్‌లో సమర్పించవచ్చు. వివరాలకు 8712658824 నంబర్‌ను సంప్రదించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
News October 12, 2025
జగిత్యాల: రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఇటీవల రద్దు చేయగా, ఎన్నికలకు బ్రేక్ పడడంతో మళ్లీ రేపట్నుంచి ప్రారంభం కానుంది.