News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు: కలెక్టర్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు.
Similar News
News April 4, 2026
రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.
News April 4, 2026
రేపే ఉప్పల్‌లో మ్యాచ్.. వీటిపై నిషేధం

రేపు 3.30PMకు ఉప్పల్‌లో SRH, LSG తలపడనున్నాయి. స్టేడియం వద్ద క్లాక్‌రూమ్ ఉండదని, నిషేధిత వస్తువులు తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
వీటిపై నిషేధం: ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ పాడ్స్, కీ చైన్లు, పెన్నులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు.
News April 4, 2026
TST, MST రాతపరీక్ష కీ విడుదల

ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఈ విషయాన్ని టీఎస్ఎల్పీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 29న నిర్వహించిన పరీక్షల కీని ఈరోజు సా.5 గం. నుంచి అఫీషియల్ వెబ్‌సైట్‌లో https://www.tgprb.in/ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఏప్రిల్ 7 సా.5 గంటల లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.


