News August 14, 2025
మంచిర్యాల జిల్లాలో మంత్రి వర్సెస్ MLA

జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా బరిలో ఉన్న అభ్యర్థులు కార్మిక వాడల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మంత్రి వివేక్ వర్గం నుంచి విక్రమ్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే మద్దతుతో సత్యపాల్‌రావు, ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌తో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇరువర్గాల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది.
Similar News
News August 16, 2025
ఉదయగిరి: దొంగలను పోలీసులుకు అప్పగించిన గ్రామస్థులు

ఉదయగిరి (M) కుర్రపల్లిలో మేకలు దొంగతనం చేసేందుకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన గోర్తుల వినోద్ కుమార్‌కు చెందిన మేకల దొడ్డిలో మేకలను దొంగలించేందుకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలు ఆటోలో వచ్చారు. మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు.
News August 16, 2025
NRPT: వారణాసిలో ప్రొఫెసర్‌పై హత్యాయత్నం

బెనారస్ వర్సిటీ ప్రొ. శ్రీరామచంద్రమూర్తిపై హత్యాయత్నం కేసులో ఊట్కూరు(M) ఆవుసలోనిపల్లికి చెందిన భాస్కర్‌ని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. UP పోలీసుల వివరాలు.. వైస్ ఛాన్సలర్ పదవి కోసం ప్రొ.బూదాటి వెంకటేశ్వర్లు, ప్రొ.శ్రీరామచంద్రమూర్తి మధ్య పోటీ ఉంది. భాస్కర్‌కి ప్రొ.వెంకటేశ్వర్లు సుపారీ ఇచ్చి శ్రీరామచంద్రమూర్తిపై దాడి చేయించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరామచంద్రమూర్తి చికిత్స పొందుతున్నారు.
News August 16, 2025
6నెలలు దేవుని కడప శ్రీవారి దర్శనం బంద్

దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు TTD వెల్లడించింది. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. 6నెలల పాటు బాలాలయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 18, 19న టీటీడీ అర్చకులు హోమాల చేస్తారు. 19వ తేదీ నుంచి బాలాలయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయి.