News December 14, 2025

మంచిర్యాల: జిల్లాలో ముగిసిన రెండవ దశ పోలింగ్

image

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 2వ దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
దీంతో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ నెలకొంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను ఎక్కించి అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు.

Similar News

News March 3, 2026

రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

వెల్దండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ వంకుడావత్ గణేశ్ (32) దుర్మరణం చెందారు. బైక్‌ను డీసీఏం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేశ్ మృతితో ఒంటి గుడిసె తాండలో విషాదం నెలకొంది.

News March 3, 2026

అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

News March 3, 2026

ప.గో: గ్యాస్ లీక్.. పరిస్థితి విషమం

image

పెనుగొండ మండల శివాలయం సమీపంలో సోమవారం రాత్రి వంట గ్యాస్ లీకై నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు తమ్మ నాగేశ్వరరావు, లక్ష్మి, సమతం మణి, పల్లవిగా గుర్తించారు. వీరిలో మణి పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తహశీల్దార్ అనితకుమారి బాధితులను పరామర్శించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.