News March 20, 2025

మంచిర్యాల జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఉపశమనం పొందనున్నారు. కానీ పంటలకు నష్టం జరిగే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 18, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

image

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News October 18, 2025

దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.

News October 18, 2025

ఈనెల 20న PGRS రద్దు: కలెక్టర్

image

ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్బంగా ఆరోజు కలెక్టరెట్లో జరగనున్న PGRS రద్దు చేసినట్లు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి కలెక్టరెట్‌కు రావద్దని సూచించారు.