News March 9, 2025

మంచిర్యాల జిల్లాలో శనివారం 6,200 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గంగా లోక్ అదాలత్ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 6,200 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.20 లక్షలు, బ్యాంకు కేసుల్లో రూ.28 లక్షలు రికవరీ అయ్యాయని వివరించారు.

Similar News

News March 9, 2025

ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

image

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

సంగారెడ్డి కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 9, 2025

రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!