News March 5, 2025
మంచిర్యాల జిల్లాలో 23 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,540 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News December 19, 2025
ఎన్నికల్లో పోటీ చేశారా? ఇలా చేయకుంటే చర్యలు తప్పవు!

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చు నివేదికలను ఎంపీడీవోలకు సమర్పించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సకాలంలో అందజేయకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బరిలో నిలిచినవారు వివరాలు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది.
News December 19, 2025
అధిక పోషక విలువల మాంసం.. కడక్‌నాథ్ సొంతం

అత్యంత పోషక విలువల కలిగిన మాంసానికి కడక్‌నాథ్ కోళ్లు ప్రసిద్ధిచెందాయి. వీటి చర్మం, మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్‌గా పిలుస్తారు. నాటుకోడితో పోలిస్తే ఈ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఈ కోళ్లు 6 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏటా 100 నుంచి 110 గ్రుడ్లను మాత్రమే పెడతాయి. వీటి గుడ్లకు, మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
News December 19, 2025
శ్రీవారిని దగ్గర నుంచి చూడాలంటే?

సాధారణ భక్తులు 70 అడుగుల దూరం నుంచి స్వామిని చూస్తే, లక్కీడిప్‌లో ఎంపికైన వారు 9 అడుగుల దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఆన్లైన్ లక్కీడిప్‌లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. అందుకే మీరు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ నేరుగా ‘ఆఫ్‌లైన్ లక్కీడిప్’లో నమోదు చేసుకుంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు డొనేట్ చేయడం వల్ల కూడా మొదటి గడప దర్శన భాగ్యం లభిస్తుంది.


