News March 31, 2025
మంచిర్యాల జిల్లా అధికారిపై చీటింగ్ కేసు

జిల్లా ఉపాధి కల్పనాధికారి రవి కృష్ణపై చీటింగ్ కేసు నమోదయింది. 4/2024లో మందమర్రికి చెందిన RTI కార్యకర్త రాజేందర్ గౌడ్ ఔట్ సోర్సింగ్ వివరాలు కావాలని RTIచట్టం ద్వారా దరఖాస్తు చేశారు. 5/2024లో రూ.25,085 చెల్లిస్తే సమాచారం ఇస్తానని సదరు చెప్పడంతో DDద్వారా నగదు చెల్లించారు. కాగా అధికారుల నుంచి సమాదానం రాకపోడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో అధికారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది.
Similar News
News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
నిత్యానంద స్వామి జీవసమాధి? రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

ఆధ్యాత్మిక గురువు <<15958341>>నిత్యానంద<<>>(47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని ఆయన శిష్యులు చెబుతున్నట్లు సమాచారం.
News April 2, 2025
ఎల్లారెడ్డి: ఆన్లైన్ షాపింగ్‌లో మోసం

సైబర్ నేరాగాళ్ల వలలో పడి మహిళ మోసపోయిన ఘటన ఎల్లారెడ్డి మండలం రుద్రవరంలో చోటుచేసుకుంది. రుద్రవరం గ్రామానికి చెందిన షేర్ల భావన ఈ నెల 26న ఒక డ్రెస్ ఆర్డర్ చేసింది. అయితే 30వ తేదీ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మహిళను బెదిరించాడు. తాను మోసపోయానని గ్రహించి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె 1930కు ఫోన్ చేయగారూ.16 వేలు హోల్డ్‌లో పడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.