News September 12, 2025

మంచిర్యాల జిల్లా వర్షపాతం వివరాలు

image

గడచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 15.9మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా చెన్నూర‌లో 57.6 MM నమోదు కాగా.. కోటపల్లిలో 52, జన్నారం11.4, దండేపల్లి8.2, లక్షెట్టిపేట22.2, హాజీపూర్22.4, కాసీపేట 2.2, తాండూర్ 2.4, భీమిని1.8, కన్నెపల్లి9.4, వేమనపల్లి8.2, నెన్నల4.2, బెల్లంపల్లి 4.6, మందమర్రి7.8, మంచిర్యాల 18.8, నస్పూర్ 20, జైపూర్ 15.8, భీమారంలో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News April 13, 2026

సూర్యాపేట: అన్నదమ్ములు అదరగొట్టారు

image

మఠంపల్లి మండలం మంచ్యాతండాకు చెందిన అన్నదమ్ములు గౌతమ్ నాయక్, మనోజ్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్ కుమారులైన వీరిలో గౌతమ్ ద్వితీయ సంవత్సరంలో 988/1000 మార్కులు, మనోజ్ ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులు సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు టాపర్లుగా నిలవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

News April 13, 2026

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘XChat’: మస్క్

image

వాట్సాప్ డేటా భద్రతపై <<19612326>>విమర్శలు<<>> వస్తున్న వేళ X అధినేత ఎలాన్ మస్క్ ‘XChat’ను ప్రకటించారు. ఏప్రిల్ 17న iOSలో లాంచ్ కానున్న ఈ యాప్‌కు ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, సెల్ఫ్-డిస్ట్రక్ట్ మెసేజ్(వాటంతటవే మెసేజ్‌లు డిలీట్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ సూపర్ యాప్‌లో 481 మందితో గ్రూప్ చాట్స్, ఆడియో-వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీ X అకౌంట్‌తోనే దీనిని వాడవచ్చు.

News April 13, 2026

కృష్ణా: గురుకుల విద్యార్థులకు వరం.. ఉచితంగా ఈఏపీ సెట్ శిక్షణ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచిత EAPSET శిక్షణ అందిస్తున్నట్లు DCO తెలిపారు. బాలికలకు ముప్పాళ్లలో, బాలురకు కృష్ణారావుపాలెంలో తరగతులు నిర్వహిస్తున్నారు. వీరపనేనిగూడెంలో కేంద్ర వర్సిటీ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు, 2026-27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయని, ఖాళీగా ఉన్న సీట్లకు రెండో జాబితా ఇస్తామన్నారు.