News March 27, 2025

మంచిర్యాల: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ సురేఖ..?

image

కాంగ్రెస్ TG ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ సురేఖకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. రేసులో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో పాటు పలువురు ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 17, 2026

MHBD: ‘టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశిరాం అన్నారు. MHBD పట్టణంలోని నాయకుల ఆశ్రయం పాఠశాలలో నిర్వహించిన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్, వెల్ఫేర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ATDO భాస్కర్, ఉపేందర్ తదితరులున్నారు.

News February 17, 2026

ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్‌

image

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

News February 17, 2026

చిత్తూరు: అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకతవకలు.?

image

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.