News March 16, 2025

మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారి ఇచ్చిన కొడుకు

image

తండ్రిపై దాడి చేయించేందుకు సుఫారి ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.

Similar News

News March 16, 2025

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌‌లో ఏప్రిల్‌ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.

News March 16, 2025

ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

image

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.

News March 16, 2025

గజ్వేల్: మొదటి ప్రయత్నంలో గ్రూప్-3 ఉద్యోగం

image

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మెుదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే వింటూ..అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు. దీంతో అతన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

error: Content is protected !!