News October 29, 2025

మంచిర్యాల: నవంబర్ 3 నుంచి పత్తి కొనుగోళ్లు

image

మంచిర్యాల జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లుల్లో నవంబర్ 3వ తేదీ నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి షహాబుద్ధిన్ తెలిపారు. జిల్లాలోని తాండూరు మండలం మహేశ్వరి కాట్స్, దండేపల్లి మండలం వెంకటేశ్వర చిన్ని మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. పత్తి రైతులు తప్పనిసరిగా కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని మాత్రమే పత్తిని విక్రయించాలన్నారు.

Similar News

News October 29, 2025

HYD: తెలుగు వర్సిటీ.. నేడు సాహితీ పురస్కారాల ప్రదానం

image

బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.

News October 29, 2025

30 ఇంజినీర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 29, 2025

సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

image

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.