News March 27, 2025
మంచిర్యాల: నిన్నటి పరీక్షకు 31 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో జరిగిన గణిత శాస్త్రం పరీక్షకు 9,198 మంది విద్యార్థులకు గాను 9,178 విద్యార్థులు, గతంలో ఫెయిలైన 90 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మొత్తం 9,288 మందికి 9,257 విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News March 30, 2025
NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.
News March 30, 2025
గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పింది: సీఎం చంద్రబాబు

AP: ‘ప్రజలే ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
News March 30, 2025
సంగారెడ్డి: 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్‌ల యజమానులందరూ ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.