News December 22, 2025

మంచిర్యాల: నేడు పల్లెల్లో కొలువుదీరనున్న పాలకవర్గాలు

image

మంచిర్యాల జిల్లాలోని 302 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎన్నికైన వారే అధికంగా ఉండటంతో, నిధుల కొరతను అధిగమించి అభివృద్ధి చేయడం వీరికి సవాల్‌గా మారింది. ప్రమాణ స్వీకారం రోజే తొలి సమావేశం నిర్వహించి పల్లె పాలనకు శ్రీకారం చుట్టనున్నారు.

Similar News

News December 24, 2025

ANU: బీఈడీ రివాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. I, II సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.

News December 24, 2025

ఐ పోలవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

image

రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంపచోడవరం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువకులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 24, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in