News August 14, 2025

మంచిర్యాల: పంచాయతీ అధికారులతో డీపీఓ సమీక్ష

image

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావ్ డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో ఈరోజు సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. క్షేత్ర స్థాయి అధికారుల తనిఖీలు, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, పౌర సేవలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీక్షించాలన్నారు.

Similar News

News August 14, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి జిల్లా పంచాయతీ కార్యదర్శికి ఎర్రకోట ఆహ్వానం
✓ భద్రాద్రి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు
✓ ఈనెల 21న చండ్రుగొండకు సీఎం రాక
✓ గురుకులాల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్: ఐటీడీఏ పీవో
✓ చెరువులా మారిన పాల్వంచ బస్టాండ్
✓ మొక్కల రాజశేఖర్‌కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం
✓ పాల్వంచలో యువకుడిపై దాడి
✓ భద్రాచలం-ఎటపాక-చర్ల రహదారి ఆగమాగం
✓ జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

News August 14, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

నందమూరులోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడారు. డిజిటల్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు.

News August 14, 2025

బెల్లంపల్లి: మూసివేసిన గనిలో చోరీకి యత్నం

image

బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని మూసివేసిన గోలేటి-1A గనిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్లు ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ చెప్పారు. సెక్యూరిటీ గార్డ్ గనిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించి గార్డును చూసి పారిపోయారన్నారు. సమాచారం అందుకున్న MTF టీం సోదా చేయగా 3 ద్విచక్ర వాహనాలు లభించాయన్నారు. వాహనాలను GM ఆఫీసులో భద్రపరిచామన్నారు.