News March 29, 2025

మంచిర్యాల: పదవి విరమణ పొందిన పోలీసులకు సన్మానం.!

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను CP అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. CP మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ సహజం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి భవిష్యత్ తరం పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఆనందోత్సవాలతో గడపాలన్నారు.

Similar News

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.

News February 16, 2026

జంగారెడ్డిగూడెం: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజపురంలో సోమవారం విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News February 16, 2026

CTR: కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకంలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని (DMHO) సుధారాణి పేర్కొన్నారు. డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మైక్రో బయాలజిస్ట్ .. మొత్తం 5 విభాగాలలో 6 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 20.