News March 28, 2025
మంచిర్యాల: పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
VHT: ఒకే రోజు 22 సెంచరీలు

విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ఇవాళ ఏకంగా 22 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ ఏకంగా డబుల్ సెంచరీ బాదారు. బిహార్ నుంచి వైభవ్ సహా ముగ్గురు ప్లేయర్లు శతకాలు చేశారు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. కాగా బిహార్ ప్లేయర్ గని 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.
News December 24, 2025
సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్.. ‘యాపిల్’ను వెనక్కు నెట్టి!

2025లో వెండి ధరలు రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నాయి. అటు ఆర్థిక నిల్వగా, ఇటు పారిశ్రామిక లోహంగా వెండికి ఆదరణ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. తాజా లెక్కల ప్రకారం వెండి మార్కెట్ విలువ సుమారు $4.04 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో ‘APPLE’ కంపెనీ మార్కెట్ విలువ ($4.02 ట్రిలియన్లు)ను వెండి అధిగమించి మూడో స్థానానికి చేరింది. ఫస్ట్ ప్లేస్‌లో గోల్డ్ ($31.41T), రెండో స్థానంలో NVIDIA($4.61T) ఉంది.
News December 24, 2025
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ముత్యాల బాబ్జి

కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ముత్యాల బాబ్జిని బుధవారం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం ఆయన చేసిన నిరంతర సేవలు, క్రమశిక్షణను గుర్తించిన అధిష్టానం ఈ కీలక బాధ్యతను అప్పగించిందని నేతలు పేర్కొన్నారు. ముత్యాల బాబ్జి నియామకంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


