News January 5, 2026
మంచిర్యాల: పుర పోరు.. త్రిముఖ పోటీ

రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీ ఏరియాలో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఉత్తేజ పరుస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొననున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News January 29, 2026
GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
News January 29, 2026
భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 29, 2026
ధర్మవరం దక్కదా? రాప్తాడు ఆప్షన్!

ధర్మవరం నుంచి 2029లో మళ్లీ మంత్రి సత్యకుమార్ పోటీ చేస్తారని BJP నేత హరీశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 2024లో సీటు త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్ భవిష్యత్తుపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రాప్తాడు నుంచి ఓటమి చెందిన శ్రీరామ్‌ను ఎలాగైనా MLAగా చూడాలని అనుచరులు కోరుకుంటున్నారు. ధర్మవరం సీటు దక్కని పక్షంలో ఆయన మళ్లీ రాప్తాడు నుంచి బరిలోకి దిగుతారా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


