News February 18, 2026
మంచిర్యాల: ప్రేమ.. పెళ్లి.. హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న <<19163523>>భర్తను <<>>ఓ భార్య హత్య చేసింది. ఎస్సై వివరాల ప్రకారం.. మందమర్రిలోని శాంతినగర్‌లో మోయిన్(42), అవంతి కులాంతర వివాహం చేసుకున్నారు. విహహేతర సంబంధం పెట్టుకుందని అతడు తరచూ ఆమెను వేధించేవాడు. సహనం కోల్పోయిన అవంతి మంగళవారం తెల్లవారుజామున కత్తితో పొడిచింది. మోయిన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 13, 2026
ఏలూరు: ఆ విషాద ఘటనకు నాలుగేళ్లు..!

ఏలూరు(D) అక్కిరెడ్డిగూడెం పోరస్ ల్యాబ్స్‌లో 2022 ఏప్రిల్ 13న సంభవించిన రియాక్టర్ పేలుడు తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై APPCB, CPCB విచారణ చేపట్టాయి. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
News April 13, 2026
ద్రాక్షారామలో ఈ “చిన్న” గుడి రహస్యం తెలుసా?

ద్రాక్షారామ ఆలయ ప్రాంగణంలోనే ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉందని స్థానికులు చెబుతారు. కలియుగం గడిచేకొద్దీ మానవుల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, అప్పుడు వారు ఈ భారీ ఆలయంలో పూజలు చేయలేరని భావించి, భవిష్యత్తులోని “పొట్టి” మానవుల కోసం ఈ సూక్ష్మ ఆలయాన్ని నిర్మించారట. దీనిని ప్రధాన ఆలయ నమూనాగా కూడా కొందరు పరిశోధకులు భావిస్తారు.
News April 13, 2026
మాణిక్యాంబ దేవి ముఖం.. వామాచార రహస్యం

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి విగ్రహం నేరుగా కాకుండా కొద్దిగా ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. ఇది అమ్మవారిని పూర్వం ‘వామాచార’ పద్ధతిలో పూజించినట్లు సూచిస్తుందని భక్తులు చెబుతారు. ఇక్కడ అమ్మవారిని శ్రీచక్రంపై ప్రతిష్ఠించారు. అమ్మవారి చూపు ఎడమవైపు ఉండటం వల్ల ఆమె శక్తి అత్యంత తీవ్రంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు.


