News September 8, 2025

మంచిర్యాల: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్‌

image

మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ, ఇతర పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకై పోరాటం చేస్తామని రఘునాథ్‌ పేర్కొన్నారు. రఘునాథ్‌ నియామకంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 9, 2025

హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు: హరీశ్

image

TG: CM రేవంత్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన ట్వీట్ చేశారు. ‘పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియదు. పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగాలు ఇవ్వడమంటే చిల్లర రాజకీయాలు చేసినంత ఈజీ కాదు. ఇప్పటికైనా CM స్పందించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News September 9, 2025

విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

image

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్‌లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.

News September 9, 2025

HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

image

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.