News January 10, 2026

మంచిర్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత భైదు

image

అనుమానంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 2023లో రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో భార్య జ్యోతిపై దాడి చేయగా, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటి ఎస్సై తహసినోద్దీన్ సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.

Similar News

News February 13, 2026

BREAKING: చౌటుప్పల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 13 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 3 బీజేపీ, 1 సీపీఎం గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

రామగుండం: ‘రెండు’ ఓట్ల తేడాతో ఘన విజయం!

image

రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్‌లో ఉత్కంఠ పోరు ముగిసింది. ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. పోటాపోటీగా సాగిన ఈ పోరులో రీకౌంటింగ్ నిర్వహించగా, చివరకు తిరుపతిని విజయం వరించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.

News February 13, 2026

‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

image

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.