News October 13, 2025
మంచిర్యాల: భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు, మోఖా, సర్వే నంబర్లు, ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలతో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 14, 2025
తనుశ్రీకి ఉత్తమ ప్రతిభ అవార్డు

అమరాపురంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని తనుశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేత ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. హుదుగుర్ గ్రామానికి చెందిన తిప్పేస్వామి, శోభ దంపతుల కుమార్తె తనుశ్రీ హైదరాబాదులో నృత్య ప్రదర్శనకు అవార్డు, ప్రశంసా పత్రం పొందినట్లు తెలిపారు. పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలికను అభినందించారు.
News October 14, 2025
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
News October 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.