News August 14, 2025

మంచిర్యాల: ‘మధ్యాహ్న భోజనం అమలు చేయాలి’

image

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని USFI విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఈరోజు ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తోన్న విధానంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు.

Similar News

News August 14, 2025

నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్: సీఎం

image

AP: నీటివనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని CM CBN అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో కరవును తరిమేయవచ్చని చెప్పారు. సాగునీటిశాఖలో ఇంజినీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామని తెలిపారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో CM అన్నారు. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News August 14, 2025

MBNR: మొహమ్మద్ మొయిజుద్దీన్ ప్రొఫైల్

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మొహమ్మద్ మొయిజుద్దీన్‌కు IPM(Indian Police Medal) భారత ప్రభుత్వం ప్రకటించింది.1989లో పోలీస్ కానిస్టేబుల్‌గా నియమితులై, అలంపూర్, తిమ్మాజిపేట్, జడ్చర్ల, పెద్దకొతపల్లి, కోస్గి PSలో విధులు నిర్వహించారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2018లో ASIగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

News August 14, 2025

MBNR: ఓపెన్ డిగ్రీ,PG.. గడువు పొడగింపు

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.