News February 25, 2025

మంచిర్యాల: మాతాశిశు ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిలవలు, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని సమయానుసారంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News November 6, 2025

SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గింది. ఈరోజు ఉదయం ఇన్‌ఫ్లో 21,954 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 21,954 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో 12,500 క్యూసెక్కులు స్పిల్‌వే గేట్ల ద్వారా, 8,000 క్యూసెక్కులు ఎస్కేప్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నారు. అటు సరస్వతి కాలువ, మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 4 గేట్లను తెరచి ఉంచారు. మొత్తం నీటినిల్వ 80.5 TMCగా ఉంది.

News November 6, 2025

గ్లోబల్ స్థాయిలో ‘రాజాసాబ్’ ప్రమోషన్స్!

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్, ప్రతి 10 రోజులకు కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నాయి. అలాగే క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని పేర్కొన్నాయి.

News November 6, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.