News January 23, 2026

మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

image

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.

Similar News

News February 15, 2026

HYD: కార్పొరేషన్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి

image

నూతనంగా ఆవిర్భవించిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన స్పష్టంచేశారు. సోమవారం ఉ.10:30 గం. నుంచి మ. ఒంటి గంట వరకు తార్నాకలోని MMC ఆఫీస్‌లో మల్కాజిగిరి, మాదాపూర్‌లోని న్యాక్ బిల్డింగ్ సీఎంసీ ఆఫీస్‌లో సైబరాబాద్ ప్రజావాణి ఉంటుంది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీస్‌లలో అధికారులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.

News February 15, 2026

నాటి ‘కడలిపల్లే’ నేటి పెదకళ్లేపల్లి క్షేత్రం!

image

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కృష్ణా నది తీరాన ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచుర్యమైన ఆలయాల్లో ఒకటి. దక్షిణకాశీగా పిలువబడే ఈ ఆలయం బౌద్ధుల కాలం నాటిదిగా చెబుతారు. బౌద్ధుల కాలంలో ఈ ప్రాంతాన్ని కడలిపల్లి అని పిలిచేవారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపు కృష్ణానది ప్రవహించడం ఇక్కడి విశిష్టత. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

News February 15, 2026

NTR: అఘాయిత్యానికి పాల్పడ్డ కీచక ఉపాధ్యాయుడు

image

విజయవాడలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు SVN కాలనీలోని స్కూళ్లో 8వ తరగతి చదువుతున్న బాలికను సదరు ఉపాధ్యాయుడు తాను చనిపోతానని బెదిరించి విజయవాడ తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. నిలదీసిన బాధితురాలి తల్లిదండ్రులను కులం పేరుతో దూషించాడు. బాలిక ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.