News January 3, 2026

మంచిర్యాల: ముడి సరుకుల కొరకు కొటేషన్ల ఆహ్వానం

image

మంచిర్యాల జిల్లాలోని 4 ప్రభుత్వ ఐటీఐలలో ముడి సరుకులు కొనుగోలు కొరకు కొటేషన్స్ ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ మంచిర్యాల, ప్రభుత్వ ఐటీఐ శ్రీరాంపూర్, ప్రభుత్వ ఐటీఐ జన్నారం, ప్రభుత్వ ఐటీఐ మందమర్రిలలో సంప్రదించాలన్నారు. ఆసక్తిగల సరఫరాదారులు తమ కొటేషన్స్‌కు సంబంధించిన ముడి సరుకుల వివరాలను సీల్డ్ కవర్‌లో జనవరి 8 సాయంత్రం 5గంటల లోపు అందజేయాలని సూచించారు.

Similar News

News January 3, 2026

రేపే భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్

image

AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపు నెరవేరనుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి వ్యాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం ల్యాండవనుంది. అందులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకుంటారు. ఇప్పటికే విమానాశ్రయంలో ATC సెంటర్లు, రన్‌వే దాదాపుగా పూర్తయ్యాయి. ‘అనుమతుల నుంచి నిర్మాణం వరకు జగన్ హయాంలోనే జరిగింది. క్రెడిట్ మాత్రం బాబు తీసుకుంటున్నారు’ అని YCP విమర్శలు గుప్పిస్తోంది.

News January 3, 2026

పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!

image

చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్‌లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News January 3, 2026

సంగారెడ్డి: ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. 2025-26 సంవత్సరానికి 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించుకోగా, 1,225 ఎకరాలు పూర్తయిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.