News January 16, 2026
మంచిర్యాల: మున్సిపల్ నగారా.. ఆశావహుల ముందస్తు ప్రచారం

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల కావడంతో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మాజీ కౌన్సిలర్లతో పాటు కొత్త ముఖాలు రంగంలోకి దిగుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, తమకు అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఆశావహులు ముందస్తు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Similar News
News February 9, 2026
SKLM: సోమవారం జడ్పీలో గ్రీవెన్స్

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
News February 9, 2026
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.