News December 26, 2025
మంచిర్యాల: మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సమాయత్తం

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థుల గెలుపునకు ఏకతాటిపైకి తెస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Similar News
News December 29, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 57 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 57 అర్జీలు స్వీకరించామన్నారు.
News December 29, 2025
HYD: రాచకొండ ఫిలిం సిటీ ముచ్చటేది..!

రాచకొండలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్రం వచ్చాక 2014 డిసెంబర్‌లో KCR సర్కార్ చెప్పింది. సీఎం స్వయంగా ఏరియల్ సర్వే కూడా చేశారు. అక్కడి 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫిల్మ్ సిటీకి 2వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుతున్నారు.
News December 29, 2025
సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 85 అర్జీలను స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


