News January 11, 2026

మంచిర్యాల: మేడారం వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్

image

సమ్మక్క సారాలమ్మ దర్శనానికి మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరేణి కార్మికుడు కుచలరెడ్డి, భార్య, కూతురుతో కలిసి మేడారం జాతరకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని శ్రీరాంపూర్‌కు తిరిగి వస్తుండగా జైపూర్ మండలం శెట్టిపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు, చెట్టును ఢీకొంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

Similar News

News February 11, 2026

శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

image

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్‌&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

News February 11, 2026

కామారెడ్డి జిల్లా 1 గం. పోలింగ్ అప్‌డేట్

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 1 గం వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో 99,313 ఓటర్లు ఉండగా కామారెడ్డి 43,486 మంది (43.79%), బాన్సువాడ 12,217 (50.51%), బిచ్కుంద 7,743 (60.69%), ఎల్లారెడ్డి 7,020 మంది (52.92%) ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం పోలింగ్ వేగం పుంజుకొని ఉత్సాహంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 47.13% పోలింగ్ నమోదైంది.

News February 11, 2026

మారిన చైనా వైఖరి: UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు!

image

UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వ ఆకాంక్షలను ‘గౌరవిస్తాం’ అని చైనా ప్రకటించింది. గతంలో ఆ దిశగా ఇండియా చేసిన యత్నాలను వ్యతిరేకించిన ఏకైక శాశ్వత సభ్యదేశం చైనా కావడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన చర్చల్లో భారత్ అధ్యక్షతన జరగబోయే BRICS సదస్సుకు కూడా చైనా పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మార్పు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాబల్యాన్ని పెంచడంతో పాటు మండలిలో శాశ్వత సభ్యత్వానికి మార్గాన్ని సుగమం చేసే ఛాన్స్ ఉంది.