News February 4, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద <<15356057>>మహిళా ఎస్ఐ శ్వేత కారు..<<>> ఓ బైక్ ను ఢీకొట్టగా ఎస్ఐతో పాటు మరో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ యువకుడు మంచిర్యాల జిల్లాలోని ఓ బ్యాంకులో పని చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లక్షెట్టిపేట పట్టణంలోని DBS బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్యాల నరేశ్(26)  ఉదయం జాబ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు.

Similar News

News November 10, 2025

సిద్దిపేట: పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్ర మంత్రి

image

మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.1,41,025 మొత్తాన్ని చెల్లించారు. పరీక్ష ఫీజు చెక్కును కలెక్టర్ హైమావతికి బీజేపీ నాయకులు అందజేశారు.

News November 10, 2025

సిద్దిపేట మెడికల్ కాలేజీకి మరో 8 సీట్లు మంజూరు

image

సిద్దిపేట మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు 83కు చేరాయి. కొత్తగా రేడియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో 8 పీజీ సీట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. అనతి కాలంలోనే సిద్దిపేట మెడికల్ కళాశాలలో 18 స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు అందిస్తుందన్నారు. ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల స్థాయిలో సిద్దిపేట వైద్య కాలేజి నడుస్తుందన్నారు.

News November 10, 2025

అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన

image

వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న మహిళా క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ జాగ్రత్తలు చెప్పారు. ‘మీకు ఇస్తామని చెప్పిన అవార్డులు, రివార్డులు అందకుంటే నిరుత్సాహపడకండి. విజేతల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. ఈ సిగ్గులేని వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దీనికి బాధపడొద్దు’ అని సూచించారు. గతంలో 1983 మెన్స్ టీమ్‌కూ ఇలాంటి హామీలు వచ్చాయని తెలిపారు.