News April 7, 2025

మంచిర్యాల: యాక్సిడెంట్‌లో విద్యార్థి మృతి

image

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్‌‌కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.

Similar News

News April 10, 2025

కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

image

అహ్మదాబాద్‌లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.

News April 10, 2025

గుంతకల్లు: రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

image

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఎస్ఆర్‌సి కమిటీ సభ్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.

News April 10, 2025

కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆలయానికి సుమారు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. 5 లక్షల ప్రసాదాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!