News April 7, 2025
మంచిర్యాల: యాక్సిడెంట్‌లో విద్యార్థి మృతి

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్‌కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News April 11, 2025
HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్ మర్డర్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.
News April 11, 2025
ఒంటిమిట్టలో హనుమంతుడు లేని రామయ్య

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ, <<16059250>>ఒంటిమిట్ట<<>> ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ‘పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ పెరగడంతో రాముడిని ప్రార్థించారు. ఆయన కోదండము, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించడంతో ఇక్కడే వెలిశారు. అప్పటికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదు’ అని పురోహితులు చెబుతున్నారు.
News April 11, 2025
పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేస్తామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.