News January 9, 2026
మంచిర్యాల: యాక్సిడెంట్.. డిగ్రీ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లాలోని <<18794592>>మోకిల <<>>వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ HYDలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
Similar News
News February 5, 2026
విజయవాడ GGHలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి!

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న ఆమె, ఆహారం తెచ్చుకుంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. ACP దామోదర్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి, ఆసుపత్రి పరిసరాల్లోని CC కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.
News February 5, 2026
NLG: నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం.. వట్టికోట ఎందరికో స్ఫూర్తి

తెలంగాణ సాహిత్య వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి శాలిగౌరారం మండలం మాధవరంలో పుట్టారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, పాదయాత్రల ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లారు. జైలు లోపల, ప్రజల మనిషి, కనువిప్పుతో పాటు ఇంకా ఎన్నో రచనలు చేశారు. నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం గడిపారు. నేటి విద్యార్థులకు పుస్తకాల రూపశిల్పిగా, అక్షర యోధుడిగా ఆయనే స్ఫూర్తిప్రదాత. కాగా నేడు ఆయన వర్ధంతి.
News February 5, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.


