News March 5, 2025
మంచిర్యాల: యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై సమావేశం

యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనల మేరకు రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. వేసవి అయినందున నీడ, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 31, 2025
నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్‌ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News December 31, 2025
సీరియల్ నటి ఆత్మహత్య.. కారణమిదే!

సీరియల్ నటి నందిని(26) <<18707144>>ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిపారు. కాగా నందిని తండ్రి(ప్రభుత్వ ఉద్యోగి) 2023లో మరణించారు. దీంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.
News December 31, 2025
చిత్తూరు జిల్లాలో 1021 సెల్ ఫోన్ల రికవరీ

చిత్తూరు జిల్లాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.42 కోట్ల విలువైన 1021 ఫోన్లను చాట్ బాట్ ద్వారా పోలీసులు రికవరీ చేశారు. మూడు దశల్లో సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అప్పగించారు. చోరీ అయిన వెంటనే బాధితులు తమ ఫోన్ల కోసం పోలీసులను ఆశ్రయిస్తుండటంతో రికవరీ శాతం పెరిగింది.


