News March 26, 2025
మంచిర్యాల: ‘యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమనికి జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ హాజరయ్యారు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి యోగ, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్14416ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@పదవి విరమణ పొందిన ఎస్సై, హెడ్ కాన్స్టేబుల్.. సత్కారించిన అదనపు ఎస్పీ @జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ @JGL-KNR కొండగట్టు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి @మొగిలిపేట -నడికుడ గ్రామ సరిహద్దుల మధ్య గొడవ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు @దూలరులో సివిల్ రైట్స్ డే కార్యక్రమం
News March 30, 2025
ఆర్మీని తరలించడంతోనే జమ్మూలో ఉగ్రదాడులు: ఒమర్

జమ్మూలో ఉగ్రదాడులు పెరగడంపై J&K సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కఠువాలో చనిపోయిన నలుగురు పోలీసుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. చైనా చొరబాట్లను ఆపేందుకు జమ్మూ నుంచి సైన్యాన్ని లద్దాక్‌కు తరలించడాన్ని టెర్రరిస్టులు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. క్రమంగా ఈ పరిస్థితిని అధిగమిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు.
News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@కలెక్టరేట్లో ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష సమావేశం @జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ఉగాది, రంజాన్ సంబురాలు @ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగిత్యాల MLA @రాయికల్‌లో పౌర హక్కుల దినోత్సవం @మెట్‌పల్లి ప్రభుత్వ కాలేజీలో మాదకద్రవ్య నిర్ములన పోస్టర్ ఆవిష్కరణ @బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి @మల్లాపూర్‌లో TDP జెండా ఆవిష్కరణ @కొండగట్టులో భక్తుల రద్దీ