News January 20, 2026

మంచిర్యాల: రాజీవ్ యువ వికాసం.. ఈ నిరీక్షణ ఇంకెన్నేళ్లో..?

image

రాజీవ్ యువ వికాసం స్కీం ప్రారంభమై, లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా అర్హులకు ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు నిరుద్యోగులను పలకరించగా.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే తామున్న ప్రాంతాల్లోనే చిన్న వ్యాపారం ప్రారంభించి స్థిరపడాలని అనుకున్నామని కానీ ఇప్పటివరకు లోన్స్ రాకపోవడంతో తమ ఆశలు ఆవిరవుతున్నాయని వారు వాపోయారు. ఈ నిరీక్షణ ఇంకెన్నేళ్లో.

Similar News

News February 18, 2026

అనకాపల్లి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: DEO

image

జిల్లాను 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని హెచ్ఎం, ఎంఈఓలను DEO అప్పారావు నాయుడు ఆదేశించారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే 10 పరీక్షలకు జిల్లాలో 20,577 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News February 18, 2026

రాయపోల్‌లో కలెక్టర్ హైమావతి తనిఖీలు

image

రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు. తొలుత కేజీవీబీ పాఠశాల వంటశాలను పరిశీలించి, భోజన నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) తనిఖీ చేసి, మందుల నిల్వలు, వైద్య సేవలపై సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

నంద్యాలలో పి-4 కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

image

నంద్యాల జిల్లాలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న పి-4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమం పురోగతిపై చర్చించారు. ఇప్పటివరకు జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న 50,038 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరికాన్ని పారద్రోలాలని సూచించారు.