News August 23, 2025
మంచిర్యాల: రాళ్లవాగులో మునిగి వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లవాగులో మునిగి మతిస్థిమితం సరిగా లేని గొల్ల చిన్న గంగయ్య(38) అనే వ్యక్తి మృతి చెందాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన గంగయ్య కోసం కుటుంబ సభ్యులు గాలించారు. శుక్రవారం ఉదయం రాళ్లవాగులో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.
Similar News
News August 23, 2025
నేడు ఖాతాల్లోకి డబ్బులు

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.
News August 23, 2025
టంగుటూరికి ఎస్.కోటతో ఉన్న అనుబంధం మీకు తెలుసా?

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎంగా టంగుటూరి ప్రకాశం పంతులు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన MLA కాదు. దీంతో అప్పుడు (1953) విశాఖపట్నం పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గం ఎమ్మెల్యే చాగంటి వెంకట సోమయాజులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ప్రకాశం పంతులు అక్కడి నుంచి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై సీఎంగా కొనసాగారు. నేడు ఆయన జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
News August 23, 2025
ఖమ్మం మార్కెట్‌లో దొంగ సెస్ బిల్లుల కలకలం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నకిలీ సెస్ బిల్లులు కలకలం సృష్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్‌లో పత్తి వ్యాపారం చేసే ఒక ట్రేడర్, మరో వ్యాపారి సెస్ పుస్తకాలను దొంగిలించి, వాటిని నకిలీగా ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ దొంగ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించారు. బిల్లులు సరిపోలకపోవడంతో మార్కెట్‌లో విచారించగా, నకిలీ బిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.