News October 31, 2025

మంచిర్యాల: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్

image

మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన జాతీయ కళాకార్ సంఘ్ సమావేశంలో ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. చిత్రకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News October 31, 2025

సిరిసిల్ల అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి

image

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడితో ఫ్రాన్స్ అమ్మాయికి శుక్రవారం ఘనంగా వివాహం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ చైతన్య గౌడ్ ఉద్యోగరీత్యా ఫ్రాన్స్ ఉంటున్నాడు. అక్కడ యువతి శాన్వి (ఇమాన్ బెన్)తో ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారంతో శుక్రవారం అబ్బాయి ఇంటి ముందు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.

News October 31, 2025

ప్రైవేటు ఆసుపత్రుల్లో రేపటి నుంచి డా. ఎన్టీఆర్ వైద్య సేవలు

image

ప్రైవేటు ఆసుపత్రుల్లో డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యథావిధిగా వైద్య సేవలు అందించనున్నట్లు తూ.గో జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి సేవలు పునఃప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 45 ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందిస్తాయని వెల్లడించారు.

News October 31, 2025

షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

image

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.