News February 7, 2026
మంచిర్యాల: రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి

జన్నారం మం. మందపల్లి గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటలకు కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూ విషాదం నింపుతున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
Similar News
News February 10, 2026
NLG: విషాదం.. పసి ప్రాణం తీసిన బాటిల్ మూత!

యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బందారపు శ్రీకాంత్, నాగరాణి దంపతుల 18 నెలల కుమార్తె భవ్యశ్రీ ఆడుకుంటూ పొరపాటున కూల్ డ్రింక్ మూత నోట్లో పెట్టుకుని మింగింది. గొంతులో ఇరుక్కోవడంతో హుటాహుటిన బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
News February 10, 2026
శ్రీశైలంలో అధికారుల వైఫల్యం

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికారుల సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారింది. రద్దీని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైంది. గంటల తరబడి క్యూలైన్లలో ఆహారం లేక భక్తులు అలమటించారు. అసహనానికి గురై క్యూలైన్ల మెష్‌లు విరగ్గొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వామి <<19098064>>గ్రామోత్సవం<<>> నిలిచిపోయింది. ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News February 10, 2026
ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
వివేకవంతులు ఎవరి గురించి అతిగా చింతించరు. ఇతరుల ప్రవర్తన, పరిస్థితులను మార్చలేమని తెలిసి కూడా వారి గురించి ఆలోచించడం వ్యర్థం. దానివల్ల మనశ్శాంతి పోతుంది. వారి కర్మలను మనం మోయలేం. మన చేతుల్లో లేని విషయాల గురించి బాధపడటం అవివేకం. అందుకే అతిగా ఆలోచించి కాలాన్ని వృధా చేసేకంటే, మన ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమం. <<-se>>#MSBP<<>>


