News April 13, 2026
మంచిర్యాల: ర్యాంకుల్లో వెనుకడుగు.. లోపం ఎక్కడ..?

మంచిర్యాల జిల్లా ఇంటర్ ఫలితాల్లో వెనుకడుగు వేసింది. ఫస్టియర్‌లో 21వ ర్యాంకు (60.31%), సెకండియర్‌లో 19వ ర్యాంకు (71.63%) సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఉత్తీర్ణత తగ్గడంపై విచారణ చేస్తున్నారు. అధ్యాపకుల కొరత ప్రభావంపై అంచనా వేస్తూ, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా, ఇంప్రూవ్మెంట్ లో మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 13, 2026
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 63 వినతులు అందగా, వాటిపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోషణ్ పక్వాడా, పీఎం ఇంటర్న్‌షిప్ పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు.
News April 13, 2026
బెంగాల్ ‘SIR’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ఒత్తిడిలో ఓటర్ల హక్కును కాలరాయొద్దని, పుట్టిన దేశంలో ఓటరుగా కొనసాగే హక్కు రాజ్యాంగబద్ధమని CJI సూర్యకాంత్ బెంచ్ పేర్కొంది. బెంగాల్ ‘SIR’లో ఓట్లు కోల్పోయిన వారి పిటిషన్లను విచారిస్తూ.. అప్పీళ్లను పరిష్కరించేందుకు పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలంది. ఏప్రిల్ 23, 29న జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఓటరు తుది జాబితాకు గడువు ముగిసినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని వ్యాఖ్యానించింది.
News April 13, 2026
ప్రతి దరఖాస్తును తక్షణమే పరిష్కరించాలి: నిర్మల్ కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అత్యధికంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


