News October 19, 2025
మంచిర్యాల: లక్కీ డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక

జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేసి భర్తీ చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాఫ్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 74 సీట్లు ఖాళీగా ఉండగా 37సీట్లను భర్తీ చేయడం జరిగిందని, బాలుర పాఠశాలలో 89సీట్లకు 38సీట్లను భర్తీ చేయడం జరిగిందన్నారు.
Similar News
News October 19, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.
News October 19, 2025
HYD: సర్కారు స్కూల్.. ఇక కొత్త స్టైల్

GHMC పరిధిలోని పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. గ్రేటర్ పరిధితోపాటు ఔటర్‌కు లోపల ఉన్న సర్కారు స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. దాదాపు రూ.3వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 1,346 ప్రభుత్వ పాఠశాలలకు ఈ మొత్తం కేటాయిస్తారు. అవసరమైతే నూతన భవన నిర్మాణాలతోపాటు, ప్రయోగశాలలు, గ్రౌండ్, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నివేదిక రూపొందించారు.
News October 19, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన మద్యం దరఖాస్తులు

2023తో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరంలో 709 దరఖాస్తులు తగ్గాయి. SEP 26న మద్యం టెండర్ల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈనెల 18 నాటికి అంచనాలను తారుమారు చేస్తూ తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 2023లో మద్యం దుకాణాలకు 2033 దరఖాస్తులు రాగా.. ఈ సంవత్సరం నిన్నటి వరకు 1324 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం దరఖాస్తులు తగ్గడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.