News December 30, 2025

మంచిర్యాల: వార్డుల వారీగా ఓటర్ జాబితా వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఎలాంటి అవకతవకలు తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు.

Similar News

News February 4, 2026

7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్

image

ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ తదితర యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేశాయి. అగ్రిగేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలను నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. కంపెనీల తీరుతో డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారన్నాయి.

News February 4, 2026

BREAKING.. కొవ్వూరులో యాక్సిడెండ్.. ఇద్దరి మృతి

image

కొవ్వూరు గోదావరి గామన్ బ్రిడ్జిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొనడంతో దుద్దుకూరుకు చెందిన కోటి (36), తాతిపూడి చిన్న సుబ్బారావు (40) ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 4, 2026

రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణమార్పులతో రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేలు, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో శారీరక ఒత్తిడి పెరిగి హర్మోన్లను నియంత్రిస్తోంది. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.