News September 24, 2025
మంచిర్యాల: విదేశీ విద్యా నిధి కోసం దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్ తెలిపారు. షెడ్యూల్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీలోగా www.telangana.epass.cgg.giv.inలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు.
Similar News
News September 24, 2025
ASF: గోల్డ్ మెడల్స్ సాధించిన కార్మికురాళ్లు

ఇద్దరు సింగరేణి మహిళా కార్మకులు గోల్డ్ మెడల్స్ సాధించారు. భూపాలపల్లిలో జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోలేటి CHP ఉద్యోగురాలు అనురాధ పవర్ లిఫ్టింగ్ 57 kg విభాగంలో, మమత 47 కిలోల విభాగంలో మెడల్స్ సాధించారు. ఈ విజయంతో కోల్ ఇండియా ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
News September 24, 2025
ASF: పాఠశాలలో పనులు వెంటనే పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి సూచించారు. బుధవారం ASF కలెక్టరేట్‌లో విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం తదితరల అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.
News September 24, 2025
ప్యాకేజ్ ఇస్తే చాలన్నట్లు పవన్ తీరు: రోజా

AP: తన మూవీ టికెట్ రేట్లు పెంచితే చాలు ప్రజలేమైనా పర్లేదన్నట్లు Dy.CM పవన్ తీరుందని మాజీమంత్రి రోజా విమర్శించారు. ‘రైతు మద్దతు ధరలేక అల్లాడుతుంటే పవన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్యాకేజ్ ఇస్తే చాలు, సినిమా రేట్లు పెంచితే చాలన్నట్లు ఉన్నారు. ఒకసారి గెలిపించండి తలరాతలు మారుస్తానని అడుక్కొని గెలిచారు. ఏ ఒక్క వర్గానికైనా ఉపయోగపడ్డారా? షూటింగ్స్ చేసుకోక మీకెందుకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు.