News October 14, 2025
మంచిర్యాల: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదు నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
Similar News
News October 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
News October 15, 2025
భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.
News October 15, 2025
సంగారెడ్డి: ఉద్యోగులు సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రైసింగ్- 2047లో ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. https://www.telangana.gov.in/telanganarising/ లింకు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చని చెప్పారు. ఉద్యోగులతో పాటు పౌరులు కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.