News October 13, 2025
మంచిర్యాల: వివాహిత సూసైడ్

జీవితం విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న హాజీపూర్ PS పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై స్వరూప్‌రాజ్ ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్-వాణి దంపతులు. వెంకటేశ్ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 13, 2025
రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్: నాదెండ్ల

AP: పీడీఎస్(రేషన్) బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఇవి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, నిఘా విభాగం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
News October 13, 2025
వంటింటి చిట్కాలు

* బొంబాయిహల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* బనానా చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్‌వాజుల్లో నీరు మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే పూలు వాడిపోకుండా ఉంటాయి.
* బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
News October 13, 2025
ధర్మవరానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ధర్మవరం ప్రాంతాన్ని రాయల కాలంలో విజయ నగర రాజులచే నియమింపబడిన క్రియాశక్తి వడయార్ అనే రాజు పాలించేవాడు. ఆయన భార్య ధర్మాంబ పేరు మీద నిర్మించిన గ్రామమే ధర్మవరం. నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు పట్టణంగా అభివృద్ధి చెందింది. ఈ పట్టణం పట్టు వస్త్రాల నేతతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.