News November 11, 2025
మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.
News November 11, 2025
TPT: రేపు ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ సమ్మిట్

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ (Startup) సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. SVU సెనెట్ హాల్ వేదికగా బుధవారం ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఔత్సాహిక యువతి, యువకులు https://forms.gle/4Fzc3Hrehf1ZsynS6 వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News November 11, 2025
EXIT POLLS: బిహార్‌లో NDAకే పట్టం!

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.


