News April 4, 2024
మంచిర్యాల: శాంతిఖని గనిలో ప్రమాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికుల వివరాల ప్రకారం.. గని మెయిన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ 47L కరువు స్టేషన్ వద్ద నుంచి లెవెల్ ఛైర్ లిఫ్ట్ స్టేషన్ కు వచ్చే చైర్ జామ్ అయింది. ఉదయం షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ శివకుమార్ ఆ ఛైర్ తీసే క్రమంలో కుడిచేతి రెండు వేళ్లు ప్రమాదవశాత్తు చివరి భాగాలు కట్ అయినట్లు కార్మికులు తెలిపారు.
Similar News
News April 22, 2025
భీంపూర్: రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీకాంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News April 22, 2025
జాగ్రత్త.. పోలీసులమని చెబితే నమ్మకండి: ADB DSP

సివిల్ డ్రెస్సులో పోలీసులమంటూ వాహన తనిఖీలు నిర్వహించినా, విలువైన ఆభరణాలు అడిగినా, వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించలని ADB DSP జీవన్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బేల మండలంలో నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ బంగారం అపహరించారని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ నూతన పద్ధతులలో మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల చెర నుంచి తప్పించుకోవాలని సూచించారు.
News April 21, 2025
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.