News February 6, 2025

మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి

image

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News November 4, 2025

అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని చెప్పారు. మిల్లులకు చేరిన లోడును తడవక ముందే వెంటనే దింపుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు.

News November 4, 2025

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా వసంతరావు

image

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా పనిచేస్తున్న వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

News November 4, 2025

లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు: ప్రకాశ్‌రాజ్

image

లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్‌గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.