News November 13, 2025
మంచిర్యాల: ‘సర్వేయర్ల సమస్యలను పరిష్కరించండి’

తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా సర్వేయర్లు కలెక్టర్ కుమార్ దీపక్‌కి ఈరోజు వినతి పత్రం ఇచ్చారు. టీఎన్జీవో ప్రెసిడెంట్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా టీఎన్జీవో ఎస్ఎల్ఆర్ ప్రెసిడెంట్ సి.ఆశిశ్ కుమార్, సెక్రటరీ సైదులు, జిల్లా సర్వేయర్స్ కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ల సమస్యలపై చర్చించి సర్వేకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.
Similar News
News November 13, 2025
నేవీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధం: సీఎం

విశాఖను దేశంలోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ సమ్మిట్ సందర్భంగా ఈస్ట్రన్ నావల్ కమాండింగ్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎంతో భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేవీ కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
News November 13, 2025
భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.
News November 13, 2025
జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పూడూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4℃గా నమోదైంది. తిరుమలాపూర్లో 10.5, మల్లాపూర్, మన్నెగూడెం 10.6, గోవిందారం 10.8, మద్దుట్ల 10.9, రాఘవపేట, కత్లాపూర్ 11.0, గొల్లపల్లి 11.1, నేరెళ్ల 11.2, మల్యాల 11.3, పెగడపల్లి 11.4, సారంగాపూర్ 11.5, జగ్గసాగర్ 11.7, పొలాస 11.9, కోరుట్ల, ఐలాపూర్ 12, గోదూరులో 12.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


